TCS: ఐరిష్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న టీసీఎస్

by S Gopi |   ( Updated:2024-10-29 19:10:41.0  )
TCS: ఐరిష్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న టీసీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అరుదైన ఘనతను సాధించింది. మంగళవారం కంపెనీ ఐర్లాండ్ దేశ ప్రభుత్వం నుంచి కీలక కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఆ దేశంలో 'మై ఫ్యూచర్ ఫండ్'గా పిలిచే కొత్త ఆటో ఎన్‌రోల్‌మెంట్ రిటైర్‌మెంట్ సేవింగ్స్ స్కీమ్‌ను అమలు చేయడంతో పాటు సాంకేతిక సాయం అందించనుంది. ఐర్లాండ్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ నుంచి 15 సంవత్సరాలకు ఈ కాంట్రాక్ట్‌ను గెలుచుకుంది. ఒప్పందానికి సంబంధించి ఆర్థిక వివరాలు బహిర్గతం కానప్పటికీ, దీర్ఘకాలానికి ఒప్పందం జరగడం, ఐర్లాండ్‌లోని దాదాపు 8 లక్షల మంది కార్మికుల ఆటోమెటిక్ ఎన్‌రోల్‌మెంట్ కోసం టీసీఎస్ ఎండ్-టూ-ఎండ్ డిజిటల్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఎన్‌రోల్‌మెంట్, రికార్డ్ మేనేజ్‌మెంట్, బెనిఫిట్ డిస్బర్స్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు కంపెనీ తన టీసీఎస్ బాఎన్‌సీఎస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనుంది. 'ఈ భాగస్వామ్యం టీసీఎస్ ఐర్లాండ్‌కు తన టెక్ పరిజ్ఞానం, ఆవిష్కరణలను విస్తరించడానికి ఒక అద్భుతమైన అవకాశం అవుతుందిని' టీసీఎస్ ఐర్లాండ్ కంట్రీ హెడ్ దీపక్ చౌదరి అన్నారు.

Advertisement

Next Story