- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Job Market: అమెరికాలో మూడున్నరేళ్ల కనిష్టానికి జాబ్ ఓపెనింగ్స్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఉద్యోగావకాశాలు భారీగా క్షీణించాయి. ఇటీవల అగ్రరాజ్యం ఎదుర్కొన్న హెలెన్, మిల్టన్ తుఫానుల కారణంగా కార్మికుల డిమాండ్‌పై ఎక్కువ ప్రభావం కనిపించింది. దక్షిణాదిలోనే అత్యధిక ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. దీనివల్ల సెప్టెంబర్ నెలలో అమెరికా జాబ్ ఓపెనింగ్స్ మూడున్నర సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయి. లేబర్ మార్కెట్లో క్షీణతకు అనుగుణంగా తొలగింపులు కూడా పెరిగాయి. సెప్టెంబర్ చివరి రోజు నాటికి జాబ్ ఓపెనింగ్స్ 4.18 లక్షలు తగ్గి 74.4 లక్షలకు తగ్గాయి. ఇది 2021, జనవరి తర్వాత నుంచి అత్యల్ప స్థాయి అని లేబర్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తన నివేదికలో పేర్కొంది. గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టాయి. పరిశ్రమల్లో ఖాళీలు భారీగా తగ్గాయి. 2023, జనవరి నుంచి లేఆఫ్స్ సంఖ్య అత్యధికంగా పెరిగింది. అయితే, కొంతమంది కార్మికులు స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. ఇతర సూచీల్లో ఇప్పటికీ జాబ్ మార్కెట్, ఆర్థికవ్యవస్థను బలంగానే సూచిస్తున్నాయి. డేటా ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, సామాజిక సహాయ రంగంలో జాతీయ ప్రాతిపదికన భర్తీ చేయని స్థానాలు 1,78,000 తగ్గాయి. విద్య మినహా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వంలో 79,000 తక్కువ ఖాళీలు ఉండగా, ఫెడరల్ ప్రభుత్వంలో ఓపెన్ పొజిషన్లు 28 వేలకు పడిపోయాయి. కానీ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలు 85,000 పెరిగాయి. ఉద్యోగ అవకాశాల రేటు 4.5 శాతానికి పడిపోయింది, ఇది డిసెంబర్ 2020 తర్వాత అత్యల్ప స్థాయి.