- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో సుప్రీం కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా ఆమె వద్దే పెండింగ్‌లో పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఇవాళ ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని.. కేవలం రెండు బిల్లులకు మాత్రం ఆదనపు సమాచారం కావాలని గవర్నర్ కోరారని గవర్నర్ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దయదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పండిందని.. ప్రభుత్వం ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం సరికాదని ప్రభుత్వ తరుఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును డిస్పోజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు ఎలా వ్యవహారించాలో ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్‌ను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బిల్లులపై గవర్నర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.