- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Accident: పెళ్లింట తీవ్ర విషాదం.. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు కారు ఢీ
దిశ, వెబ్ డెస్క్/ జగిత్యాల కలెక్టరేట్: జగిత్యాల జిల్లా ధరూర్ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జనగామ నుండి జగిత్యాల వస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల మిషన్ కాంపౌండ్ కు చెందిన రాజమల్లు-లక్ష్మి దంపతులు తమ కుమారుడు సంకీర్త్ మరో యువతి రాజి తో కలిసి జనగామ లో కూతురు పెళ్లి రిసెప్షన్ కు శనివారం హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణంలో ధరూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు అన్నయ్య సంకీర్త్ , స్నేహితురాలు రాజీ సంఘటన స్థలంలోనే చనిపోయారు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు రాజమల్లు, లక్ష్మీ లకు తీవ్ర గాయాలు కాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో పెళ్లికూతురు తల్లి లక్ష్మీ ని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ షిఫ్ట్ చేసారు.ఈ ఘటన తో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.