Khairatabad Ganesh : ఫలించిన పోలీస్ వ్యూహం.. గంగమ్మ ఒడికి బడా గణపతి

by GSrikanth |   ( Updated:2023-09-28 08:10:28.0  )
Khairatabad Ganesh : ఫలించిన పోలీస్ వ్యూహం.. గంగమ్మ ఒడికి బడా గణపతి
X

దిశ, సిటీ బ్యూరో: వినాయకుడు ఖైరతాబాద్ గణనాథుడిని అనుకున్న సమయానికి నిమజ్జనానికి తరలించడంలో పోలీసుల వ్యూహం ఫలించింది. ఉదయం ఏడు గంటలకు నిమజ్జనం కోసం తరలిన గణనాథుడు ఒంటిగంట కల్లా ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్-4 చేరుకున్నాడు. చివరి సారి భారీ గణనాథుడి నిమజ్జనం తిలకిచడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి నిమజ్జనం నిమిత్తం బయలుదేరిన పలు మండపాలు ట్యాంక్బండ్ పై ఇంకా క్యూ కట్టి ఉన్నాయి. క్రమంగా సాగర తీరం జనసంద్రం అవుతుంది. సరిగ్గా 01:30 గంటలకు బడా గణపతి నిమజ్జనం పూర్తయింది.

Advertisement

Next Story