ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలల విజయం: మంత్రి పొన్నం

by Anjali |   ( Updated:2024-04-30 14:26:05.0  )
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలల విజయం: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నేడు పదవ తరగతి ఫలితాలు విడుదైన విషయం తెలిసిందే. కాగా మంత్రి పొన్నం మంచి మార్కులు సాధించిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ‘‘ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల స్కూళ్లు అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. బీసీ గురుకుల విద్యార్థులు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 6.94 ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించడం హర్షణీయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 261 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా 153 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 391 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి తమ ప్రతిభను చాటారు.

ఈ ఏడాది బీసీ గురుకులాల్లో 17845 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్ష రాయగా.. వారిలో 17533 మంది విద్యార్థులు ఉత్తీర్ణతా సాధించారు. వారిలో 8853 మంది బాలికలు ,8680 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో హుస్నాబాద్ నియోజకవర్గం ఉన్న సిద్దిపేట జిల్లా రెండవ స్థానం రావడం సంతోషం కలిగింది.

అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బిసీ గురుకుల సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందలు. భవిష్యత్ లో మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షితున్నాను. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మెస్ చార్జీలు గ్రీన్ చానెల్ ద్వారా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, వసతి గృహాలకు పక్కా భవనాల నిర్మాణం చేస్తాం’’. భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులను అభినందించడంతో పాటు అధ్యాపక బృందానికి, సిబ్బందిపై పొన్నం ప్రశంసల వర్షం కురిపించారు.

Read More...

ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ప్రధాని మోడీకి భయం: అద్దంకి దయాకర్

Advertisement

Next Story