రాత్రివేళల్లో స్టంట్‌లు! నగరంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు!

by Ramesh N |   ( Updated:2024-03-30 13:45:24.0  )
రాత్రివేళల్లో స్టంట్‌లు! నగరంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: చీకటి పడిందంటే చాలు హైదరాబాద్ నగరంలో కొంత మంది ఆకతాయిలు విచ్చల విడిగా ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్నారు. దీంతో వచ్చి పోయే ఇతర వాహనాదారులకు ఇబ్బందిగా మారుతున్నారు. ఇది వరకు నగర శివార్లలో నిర్వహించే బైక్ స్టంట్‌లు ఇప్పుడు ఏకంగా సీటిలో ఆకతాయిలు స్టంట్‌లు వేస్తూ ఇతరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజేంద్రనగర్ పరిధిలో యువకులు రెచ్చిపోతున్నారు. బైక్‌లతో రాత్రి వేళల్లో స్టంట్‌లు వేస్తున్నారు.

అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 140 నుంచి 170 వరకు బైక్ లతో స్టంట్‌లు చేస్తూ ఆకతాయిలు హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరోవైపు ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిచారు. వారికి పోలీసులు.. ట్రాఫిక్ రూల్స్ అంటే భయం లేదని వెంటనే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Advertisement

Next Story