మా రేవంతన్న ఇచ్చిన ధైర్యం! స్టూడెంట్స్ వీడియో వైరల్

by Ramesh N |
మా రేవంతన్న ఇచ్చిన ధైర్యం!  స్టూడెంట్స్ వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల్లో మహిళ ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఉచిత ప్రయాణంపై మహిళల స్పందన పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై స్టూడెంట్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ఫోన్‌లో చార్జీంగ్ లేదు.. చేతిలో డబ్బులు లేవు.. ‘ఫోన్ పే’ చేసే ఫ్రెండ్ లేడు.. ఏంట్రా నీ ధైర్యం.. మా రేవంత్ అన్న ఇచ్చిన ధైర్యం రా.. ఫ్రీ టికెట్ అని అమ్మాయిలు వీడియోలో చెబుతారు. అది కూడా రాత్రి సమయంలో ఓ బస్టాప్ వద్ద నిలబడిన ఉన్నట్లు వీడియోలో కన్పిస్తుంది.

కాగా, ఉచిత ప్రయాణం వల్ల సిబ్బంది తమను చులకనగా చూస్తున్నారని మరికొంత మంది మహిళలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టేజీల వద్ద ఎక్కువ మంది మహిళలు కనబడితే బస్సులు ఆపడం లేదని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ స్కీం పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని ఆందోళన చేసింది.

Advertisement

Next Story