పేపర్ లీకేజీపై విద్యార్థి, నిరుద్యోగ మహా దీక్ష

by Mahesh |
పేపర్ లీకేజీపై విద్యార్థి, నిరుద్యోగ మహా దీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సంచనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ విద్యార్థి, నిరుద్యోగ మహాదీక్షకు పిలుపునిచ్చాయి. ఏప్రిల్ 11న చలో ఇందిరా పార్క్ అంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, తక్షణమే ఈ వ్యవహారంపై సీఎం స్పందించి..ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు నెలకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లీకేజీకి సంబంధం ఉన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు దీక్షకు పిలుపునిచ్చాయి.




Advertisement

Next Story

Most Viewed