- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
భద్రాద్రి రాముని పేరిట చందాలు సేకరిస్తే కఠిన చర్యలు : ఆలయ ఈవో
దిశ, వెబ్ డెస్క్ : భద్రాచలం(Bhadrachalam) శ్రీరామచంద్ర స్వామి పేరుతో చందాలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచల ఆలయ ఈవో రమాదేవి హెచ్చరించారు. ఇటీవల భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ(USA) పేరుతో అమెరికాలోని అట్లాంటాలో... భద్రాచలం శ్రీరామచంద్రుని గుడి తరహాలో ఆలయాన్ని నిర్మించి, విదేశాల్లోని తెలుగు వారి నుండి చందాలు వసూలు చేశారు సంస్థ నిర్వాహకులు. అలాగే ఈ సంస్థ ప్రముఖ నగరాల్లో, పట్టణాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ.. అనేక విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో నేడు భద్రాచలం చేరుకున్న సంస్థ సిబ్బంది ఇక్కడ కూడా సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి సంస్థ సిబ్బందిని, నిర్వహకులను నిలదీశారు. భద్రాద్రి రామచంద్రమూర్తి పేరుతో వసూళ్లకు పాల్పడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ ఈవో మీడియాకు తెలిపారు. భద్రాద్రి పేరుతో ఎవరైనా చందాలు సేకరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ సీరియస్ అయ్యారు.