వింత ఘటన.. 24 వేళ్ళతో జన్మించిన శిశువు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-18 03:17:13.0  )
వింత ఘటన.. 24 వేళ్ళతో జన్మించిన శిశువు
X

దిశ, కోరుట్ల : కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ శిశువు ఏకంగా 24 వేళ్ళతో జన్మించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మొదటి ప్రసవం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన మగ శిశువు చేతులు, కాళ్లకు మొత్తం 24 వేళ్ళు ఉండటాన్ని వైద్యులు గమనించారు. అరుదుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని, ఇలా జన్మిస్తే శిశువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు తెలిపారు. తల్లి, శిశువు క్షేమంగా వున్నారని వారు పేర్కొన్నారు.

Advertisement

Next Story