- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mlc Kavitha స్టేట్‌మెంట్ రికార్డు.. ముగిసిన సీబీఐ విచారణ
దిశ వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సీబీఐ విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉదయం నుంచి 7 గంటలకు పైగా ఆమెను అధికారులు ప్రశ్నించారు. కవిత చెప్పిన స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేశారు. విచారణ అనంతరం కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇక సీబీఐ అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులిచ్చారు. అయితే తన ఇంట్లోనే విచారించాలని కవిత కోరడంతో సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చారు. సీబీఐ బృందంలో ఓ మహిళ కూడా ఉన్నారు. కవిత అడ్వకేట్ ఆధ్వర్యంలో ఆమెను సీబీఐ అధికారులు విచారించారు.
తొలి నుంచి కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని కవిత చెప్పారు. చెప్పినట్లుగానే తాజాగా సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపిస్తున్నారు. కవిత సీబీఐ విచారణ సమయంలోనూ ఆమె ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. కవితకు ధైర్యం చెబుతూ నినాదాలు చేశారు.