న్యూ ఇయర్ వేడుకల వేళ రాష్ట్ర పోలీసులు అలర్ట్.. డీజీపీ కీలక ఆదేశాలు

by GSrikanth |
న్యూ ఇయర్ వేడుకల వేళ రాష్ట్ర పోలీసులు అలర్ట్.. డీజీపీ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లతో డీజీపీ రవిగుప్తా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు డీజీపీ ఆదేశించారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా హైదరాబాద్‌కు డ్రగ్స్ వచ్చే వచ్చే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. డ్రగ్స్ విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయలని తెలిపారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో డ్రగ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇక నుంచి ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు జరపాలంటే కాళ్లు వణికిపోవాలని అన్నారు. దీంతో సీఎం ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు డ్రగ్స్‌పై అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story