సిట్ వర్సెస్ సెంట్రల్ ఏజెన్సీస్

by Mahesh |
సిట్ వర్సెస్ సెంట్రల్ ఏజెన్సీస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, స్టేట్ పోలీసుల మధ్య వార్ నడుస్తున్నది. రాష్ట్రంలో నమోదైన కేసులను ఎంక్వైరీ చేసేందుకు సీబీఐ, ఈడీ ఎంటర్ అవుతున్నాయి. కాని, ఆ సంస్థల అధికారులకు స్టేట్ పోలీసులు సహకరించడం లేదు. ఎన్నిసార్లు లేఖలు రాసినా కేసు వివరాలు ఇవ్వడం లేదు. దీంతో విసిగిపోయిన సెంట్రల్ ఏజెన్సీలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. తమకు పోలీసులు సహకరించడం లేదని కేసులు వేస్తున్నాయి. కింది కోర్టులో సర్కారుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పై కోర్టుకు వెళ్తున్నారే తప్ప కేంద్ర దర్యాప్తు సంస్థలకు పోలీసులు సహకరించట్లేదు.

ఈడీకి సహకరించిన సిట్

సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించేందుకు ఈడీ ఎంటర్ అయింది. నిందితుల నుంచి సేకరించిన సమాచారం తమకు ఇవ్వాలని సిట్ అధికారులకు పలుమార్లు లేఖలు రాసింది. కానీ సిట్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే కేసు వివరాలను నేరుగా తెలుసుకునేందుకు నిందితులను తమ కస్డడీకి ఇవ్వాలని ఈడీ వేసిన పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 17, 18 తేదీల్లో రాజశేఖర్, ప్రవీణ్‌లను చంచలగూడ జైల్లో విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

ఫామ్ హౌజ్ కేసులో సీబీఐకి నో ఎంట్రీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రలోభ పెడుతున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేంద్ర బీజేపీ లీడర్లపై కేసులు నమోదు చేశారు. సమగ్ర విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కేసును సిట్ నిస్పక్షపాతంగా విచారణ చేయలేదని, కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు సిట్‌ను రద్దు చేసి, విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed