- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర బీజేపీ ఎంపీ సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే రాష్ట్రం రూ.ఐదున్నర లక్షల కోట్ల అప్పులో ఉందని ఇప్పుడు చెబుతున్నారని, తెలంగాణ అప్పుల్లో ఉందని తెలిసే కదా వారు ఆరు గ్యారంటీలిచ్చిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలకు నిధులకు ఎలా తెస్తారో స్పష్టత లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వ ఓటు బ్యాంకులో చీలిక రావడం వల్లే కాంగ్రెస్ లాభపడింది తప్పితే ఆ పార్టీ బలపడలేదని ఆయన విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని, గవర్నర్ ప్రసంగం చూస్తే ఆరు గ్యారంటీల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటలే లేవని లక్ష్మణ్ పేర్కొన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన అన్నారని, మరి ఏమైందని ఆయన ప్రశ్నించారు. అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ ఎన్నికలపై కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని, దీనిపై అధిష్టానం చెప్పిన దాన్ని తూచ తప్పకుండా పాటిస్తామన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని, ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం భారం ఇతర వర్గాలపై పడిందని, కొందరు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారిని ఆదుకోవాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. వారికోసం తీసుకుంటున్న చర్యలేంటో కాంగ్రెస్ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఆర్టీసీ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, దీనిపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌కు వంద రోజులు గడువిస్తున్నామని, అప్పటికీ అమలుచేయకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు.