- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T-కాంగ్రెస్ మరో సంచలన హామీ.. ప్రకటించిన శ్రీధర్ బాబు
దిశ, కరీంనగర్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీకాంగ్రెస్ మరో సంచలన హామీ ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆలోచన విధానం మార్చే విధంగా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే కరెంటుకి ఇబ్బంది రాకుండా స్టేట్ గ్రిడ్ సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించిందని గుర్తు చేశారు.
రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గంటల ఉచిత విద్యుత్ అందించిందని గుర్తు చేశారు. రైతులకు పారిశ్రామికవేత్తలకు కరెంటు సమస్యలు రాకూడదని భావించి జైపూర్ విద్యుత్ ప్లాంట్‌తో పాటు భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ విభజన చట్టంలో క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని శ్రీధర్ బాబు అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ చెప్పుకోవడానికి పథకాలు ఏమీ లేక కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ధరణిలో ఉన్న లోపాలను సవరించి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎవ్వరి భూమి ఎక్కడికి పోదని ధరణిలో లోపాలను సవరిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. లక్ష కోట్లతో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పకపోవడం విడ్డూరం అని శ్రీధర్ బాబు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనం వృథా అయినప్పటికీ కేసీఆర్ పెద్దపల్లి మంథని సభల్లో ఏమీ మాట్లాడలేదని శ్రీధర్ బాబు ఆరోపించారు.