- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోవాటెల్‌లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
దిశ, శేరిలింగంపల్లి: నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నేటి నుంచి 13వ తేదీ వరకు శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. ఫుడ్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా శ్రీలంకకు చెందిన, అంతర్జాతీయ వంటకాలలో ప్రావీణ్యమున్న ప్రముఖ చెఫ్ అనురా లెనోరా సహకారంతో ఈ ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ లో శ్రీలంక వంటకాలతో పాటు శ్రీలంక లోని సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన వంటకాలను తయారు చేయనున్నారు. పోర్చుగీస్, డచ్, బ్రిటీష్ వారి వంటకాలు కూడ ఫుడ్ ప్రియులకు అందుబాటులో ఉంటాయి. శ్రీలంక ఫుడ్ ఫెస్ట్ లో మోరుంగా మాలువా, అలనిబితి కర్రీ, మాలు మిరిస్ పురవాలా, పరిపు మసాలా, ఎలవాలు కట్‌లెట్, ఎలు మాస్ కర్రీ, మాలు కిరీ హోడ్డా, కుకుల్ మాస్ తదితర శాఖాహార, మాంసాహార వంటకాలతో సహా అనేక రుచికరమైన శ్రీలంక ఫుడ్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ మనీష్ దయ్య, శ్రీలంక చెఫ్ అనురా లెనోరా తదితరులు పాల్గొన్నారు.