SRH Vs MI: ఉర్రూతలూగిన ఉప్పల్ స్టేడియం.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌కు కేటీఆర్ ఫిదా, ట్వీట్ వైరల్

by Shiva |
SRH Vs MI: ఉర్రూతలూగిన ఉప్పల్ స్టేడియం.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్‌కు కేటీఆర్ ఫిదా, ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీఎల్ చరిత్రలోనే రికార్డ్ స్కోరు నమోదైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. కోల్‌కతాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తృటిలో విజయానికి దూరమైనా ఉప్పల్‌లో మాత్రం జూలు విదిల్చింది. ఫలితంగా 277 పరుగుల రికార్డు స్కోర్ నమోదైంది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులతో ఐపీఎల్ 2014 ఎడిషన్‌లో ఫాస్టెస్ట్ ఫిస్టీ నమోదు చేశాడు. మరో ఓపెన్ మయాంక్ అగర్వాల్ 13 బంతుల్లో 11 పరుగులకే వెనుదిరిగాడు.

అనంతరం వచ్చి అభిషేక్ శర్మ 7 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 23 బంతుల్లో 63 పరుగులతో మరో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఈరోజు SRH బ్యాట్స్‌మెన్లు పవర్ హిట్టింగ్‌తో ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేశారు, ఐపీఎల్‌లో సరికొత్త రికార్డుతో 20 ఓవర్లలో 277 పరుగులు చేశారు. టేక్ ఏ బౌ అబ్బాయిలు, హైదరాబాద్‌ను అలరించినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story