సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు

by Kalyani |   ( Updated:2022-12-24 14:10:44.0  )
సంక్రాంతి పండగకు ప్రత్యేక రైళ్లు
X

దిశ, మెట్టుగూడా: సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని దక్షణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు వచ్చే ఏడాది తేదీలావారీగా జనవరి3,5,7,10,12,14,17న మచిలీపట్నం-కర్నూలు, 4,6,8,11,13,15,18న కర్నూలు-మచిలీపట్నం, 1,2,4,6,8,9,11,13,15, 18న మచిలీపట్నం-తిరుపతి, 2,3,5,7,9,10,12,14,16,17న తిరుపతి-మచిలీపట్నం, 6,13న విజయవాడ-నాగర్ సోల్, 7,14న నాగర్ సోల్-విజయవాడ, 2,4,6,9,11,13,16,18న కాకినాడ- లింగంపల్లి, 3,5,7,10,12,14,17,19న లింగంపల్లి-కాకినాడ, 2,9,16న పూర్ణ-తిరుపతి, 3,10,17న తిరుపతి-పూర్ణ, 6,13న తిరుపతి-అకొల, 8.15న అకొల-తిరుపతి, 1,8,15న మచిలీపట్నం-సికింద్రాబాడ్, 1,8,15న సికింద్రాబాడ్-మచిలీపట్నం. అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Next Story