ఈయన... మన కేసీఆరేనా..?

by S Gopi |   ( Updated:2022-09-01 03:54:49.0  )
ఈయన... మన కేసీఆరేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: గాల్వాన్ ఆర్మీ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లిన సందర్భంగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సన్నివేశం ఆధారంగా బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలనే తనకే గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బీహార్ పర్యటనలో భాగంగా పాట్నా సాహిబ్ గురుద్వారాను సీఎం కేసీఆర్ సందర్శించారు. అయితే, అక్కడ కేసీఆర్ సిక్కులు ధరించే తలపాగా ధరించి గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే, కేసీఆర్ తలపాగా ధరించి ఉన్న ఫొటోలను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ట్రోల్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రధాని మోడీ ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్లి అక్కడి బట్టలు, టోపీలు పెడుతాడు.. ఇదేం రాజకీయమండి అంటూ కేసీఆర్ అన్న వ్యాఖ్యలకు ఈ ఫొటోలను జోడిస్తూ పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమందైతే ఈయనను ఎక్కడో చూసినట్టు ఉంది.. అచ్చం మన కేసీఆర్ లాగే ఉన్నాడు.. ఆయనేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : బీహార్ వేదికగా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్


Also Read : నేను రాజీనామా చేయను... లేదు, లేదు మీరు చెయ్యాల్సిందే...

Advertisement

Next Story