తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ కవిత స్పెషల్ రిక్వెస్ట్

by GSrikanth |
తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ కవిత స్పెషల్ రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 8న భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో నిర్వహించే నిరసన ధర్నాకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం డీజీపీ రవిగుప్తను ఫోన్‌లో సంప్రదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నియామకల్లో జీవో-3తో మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ధర్నాను చేపడుతున్నామన్నారు. పోలీసుశాఖ అనుమఇవ్వలేదని, ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నారు.

శాంతియుతంగానే తాము ధర్నాను కొనసాగిస్తామని తెలిపారు. మహిళలకు 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయిందని.. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల ఉద్యోగాల నియామకాల్లో మహిళలకు కేవలం 12 శాతం ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని.. చాలా మంది మహిళలకు అన్యాయం జరిగినందున జీవో 3ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ ధర్నా చేపడుతున్నామన్నారు.

Advertisement

Next Story