CPS రద్దుకు ప్రత్యేక పూజలు

by GSrikanth |   ( Updated:2023-02-11 13:04:47.0  )
CPS రద్దుకు ప్రత్యేక పూజలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలన్న తమ అభిమతం నెరవేరాలని కాంక్షిస్తూ యోగి మల్లవరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెస్టారేషన్ ఫెడరేషన్(ఎన్ఎమ్ఓపీఎస్ఆర్ఎఫ్) జాతీయ ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు కొత్త పింఛను పథకం యమగండంలా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 80 లక్షల మంది ఉద్యోగులు కాంట్రీబ్యుటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నారని వివరించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు పాత పింఛను పథకం పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను అమలు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు.

Advertisement

Next Story