Delhi Liquor Scam Case: స్పెషల్ కోర్టులో నిందితులకు చుక్కెదురు

by GSrikanth |   ( Updated:2022-12-19 10:22:51.0  )
Delhi Liquor Scam Case: స్పెషల్ కోర్టులో నిందితులకు చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను స్పెషల్ కోర్టు తాత్కాలికంగా రెడ్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే బెయిల్ మంజూరు చేయలేమని పేర్కొని తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తీహార్ జైల్లో ఉన్న అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రా రెడ్డి, బోయిన్‌పల్లి అభిషేక్, విజయ్ నాయర్, వినయ్‌బాబులను ఈడీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు ముందు హాజరుపరిచింది. వినయ్‌బాబు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేయగా మిగిలిన ముగ్గురికి మాత్రం జనవరి 4న విచారించనున్నట్లు స్పెషల్ కోర్టు పేర్కొన్నది. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌బాబును ఈడీ గత నెల 10న అరెస్టు చేసింది. అప్పటి నుంచి వారు పోలీసు కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

వీరిద్దరితో పాటు విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్ సైతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. వీరంతా బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ స్పెషల్ కోర్టు మంజూరు చేయలేదు. ఈడీ తరఫున వ్యక్తమైన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి విచారణను జనవరి మొదటి వారంలో పూర్తిచేసిన తర్వాత బెయిల్ మంజూరు కావడంపై స్పష్టత రానున్నది. వాస్తవానికి వీరందరి జ్యుడీషియల్ కస్టడీ సోమవారం (డిసెంబర్ 19)తో ముగిసినా జనవరి 4, 9 తేదీల వరకు స్పెషల్ కోర్టు పొడిగించడంతో తీహార్ జైల్లోనే గడపనున్నారు.

ఇవి కూడా చదవండి :


ఈడీ ముందు హాజరైన MLA పైలట్ రోహిత్ రెడ్డి..

Advertisement

Next Story

Most Viewed