హై కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని

by Mahesh |
హై కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. దీంతో విచారణ చేపట్టిన కోర్టు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఈ రోజు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చిన కోర్టు.. చర్యలు తీసుకోకపోతే.. సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది. కాగా కోర్టు నిర్ణయంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తనదైన శైలిలో స్పందించారు. పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని.. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లు భావించాలని కూనంనేని సాంబశివరావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed