Pocharam Srinivas Reddy: పుట్టిన రోజు నాడే కంట తడిపెట్టిన స్పీకర్ పోచారం

by Satheesh |   ( Updated:2023-02-10 07:00:10.0  )
Pocharam Srinivas Reddy: పుట్టిన రోజు నాడే కంట తడిపెట్టిన స్పీకర్ పోచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజునాడే కంట తడిపెట్టారు. తన బాల్య మిత్రుడిని తలుచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్పీకర్ పోచారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మనారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్పీకర్.. తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మరణాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు. తన మిత్రుడి మరణం కారణంగా నియోజకవర్గంలో తన పుట్టిన రోజు వేడుకలను రద్దుచేసుకున్నారు. సాలంబీన్ అలీఖాన్ అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో స్పీకర్ వెళ్లనున్నారు.

స్పీకర్‌కు విష్ చేసిన మంత్రులు:

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ ఛాంబర్‌లో మంత్రులు హారీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చం అందజేసి విష్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ చేత కేక్ కట్ చేయించారు.

Advertisement

Next Story