Speaker Gaddam Prasad : కేటీఆర్‌కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్

by Y. Venkata Narasimha Reddy |
Speaker Gaddam Prasad : కేటీఆర్‌కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యేల ఓరియంటేషన్ ఫోగ్రామ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ఖండించారు. స్పీకర్ సభలో సభ్యులందరికి చెందిన వాడని, ప్రతిపక్షాలు కూడా నేను స్పీకర్ గా ఎన్నికవ్వడానికి సహకరించారన్న సంగతి మరువరాదని గడ్డం ప్రసాద్ వ్యాఖ్యానించారు. నేను ఏక పక్షంగా వ్యవహరిస్తున్నానంటూ కేటీఆర్ మాట్లాడటం సీనియర్ శాసన సభ్యుడిగాఆయన విజ్ఞతకు, వ్యక్తిత్వానికి తగదన్నారు.

బీఆర్ఎస్ వాళ్లు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న నైరాశ్యంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. సభలో అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు.

Advertisement

Next Story