Indian Racing League : కాసేపట్లో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-10 06:04:27.0  )
Indian Racing League : కాసేపట్లో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సాగర తీరాన కాసేపట్లో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. శనివారం ఈవెంట్ క్వాలిఫై రేస్ -1తో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం వరకు రెండు క్వాలిఫయింగ్ రేస్ లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్ వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెక్లెస్ రోడ్డులోని 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై కార్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. మొత్తం 12 రేసింగ్ కార్లు ఈ రేసింగ్ లీగ్ లో పాల్గొననున్నాయి. ఈ రేసింగ్ లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. రేసర్లు, నిపుణులు, నిర్వహణ యంత్రాంగంతో పాటు వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నగరానికి చేరుకున్నారు. ఈ సారి అధికారులు, నిర్వాహకులు మరింత పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Advertisement

Next Story