స్వరం వణుకుతున్న నిజమే మాట్లాడండి.. తాజా వివాదం నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్

by Sathputhe Rajesh |
స్వరం వణుకుతున్న నిజమే మాట్లాడండి.. తాజా వివాదం నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కీలక సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు అంటూ ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన పోస్ట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్ చేశారు. ‘కెరీర్ పబ్లిక్‌లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు.. స్వరం వణుకుతున్న నిజాన్నే మాట్లాడండి..’ అంటూ ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారనే చర్చ జరుగుతోంది. దివ్యాంగుల రిజర్వేషన్‌పై వరుసగా విమర్శలు వస్తున్నా ఈ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు.

Advertisement

Next Story