- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మరోసారి చిట్టీలు
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష(Group-1 Mains Exam)లో చిట్టీలు తీసుకొచ్చి మరో అభ్యర్థి పట్టుపడ్డారు. హైదరాబాద్ జిల్లాలోని జీ.నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ పరీక్ష కేంద్రంలో(హాల్ టికెట్ నంబర్ 240927384) ఒక అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో సదరు అభ్యర్థిని పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. అంతేకాకుండా ఆ అభ్యర్థిని డిబార్ చేసినట్లు టీజీపీఎస్సీ(TGPSC) అధికారులు స్పష్టంచేశారు. అయితే సదరు అభ్యర్థి వద్ద లభించిన చిట్టీల్లో ఉన్న సమాధానాలకు ఏ ప్రశ్నకూ పొంతన లేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా శుక్రవారం పరీక్షలో సైతం ఇలాగే చిట్టీలతో ఒక అభ్యర్థి పట్టుపడింది. తాజాగా మరో అభ్యర్థి పట్టుపడటం గమనార్హం. ఈ వరుస ఘటనలతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శనివారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ ప్రెటేషన్ పరీక్షకు మొత్తం 21,181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది 67.4 శాతంగా ఉంది. ఇదిలాఉండగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు(Group-1 Mains Exam) ఈనెల 21న ప్రారంభమయ్యాయి. ఈనెల 27న ముగియనున్నాయి. మొత్తం 46 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ జరుగుతోంది. కాగా ఆదివారంతో పరీక్ష ముగియనుంది.