రేపటి నుంచి కేసీఆర్ నియోజకవర్గాల బాట

by Mahesh |   ( Updated:2023-10-25 06:05:55.0  )
రేపటి నుంచి కేసీఆర్ నియోజకవర్గాల బాట
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్ కేసీఆర్ గురువారం నుంచి మళ్లీ నియోజకవర్గాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఎన్నికలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ చేపట్టబోయే నియోజకవర్గాల టూర్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఆ టూర్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ముందుగా నాగర్ కర్నూల్‌లో సీఎం పర్యటన ఉన్నప్పటికీ దానిని రద్దు చేసి వనపర్తిలో నిర్వహిస్తున్నారు. 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు.

స్టేషన్ ఘన్‌పూర్‌లో ముందస్తుగా సభ ఉంటుందని ప్రకటించినప్పటికీ దానిని రద్దుచేసి ఆ స్థానంలో మహబూబాబాద్, వర్దన్నపేట ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన ఖరారు చేశారు. 28న ఆదివారం కావడంతో సభలకు విరామం. 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌, 31 హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ, నవంబర్‌ 1న సత్తుపల్లి, ఇల్లందు, 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి, 3న భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి, 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్స్, సభలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed