SLBC: టన్నెల్‌లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్‌.. రంగంలోకి దిగనున్న ఆ రోబోటిక్ టీమ్

by Shiva |   ( Updated:2025-03-13 04:04:22.0  )
SLBC: టన్నెల్‌లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్‌.. రంగంలోకి దిగనున్న ఆ రోబోటిక్ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: దోమలపెంట (Domalapenta)లోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC Tunnel)లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) సరిగ్గా నేటికి 20వ రోజుకు చేరింది. ఇప్పటికే 11 రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గత 20 రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే టన్నెల్ (Tunnel) నుంచి ఓ మృతదేహాన్ని వెలికి తీయగా మరో ఏడుగురి ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు అటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు టన్నెల్ 13.50 కి.మీ దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు (Rescue Teams) మరింత మందుకు వెళ్లలేకపోతున్నాయి.

ఈ క్రమంలోనే సహాయక చర్యల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డీ1, డీ2 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు వీలు లేకుండా ఉంది. అయితే, రెస్క్యూ టీమ్స్ వెళ్లలేని ఆ ప్రాంతాల్లో రోబోలతో సెర్చ్ చేయించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోబోలతో ‘అన్వి’ రోబోటిక్ బృందం (‘Anvi’ Robotic Team) సెర్చ్‌ ఆపరేషన్ (Search Operation) చేపట్టనుంది. ఈ మేరకు మరికొద్దిసేపట్లో టన్నెల్‌ దగ్గరకు రోబోలు రానున్నాయి. మరోవైపు క్యాడవర్ డాగ్ స్క్యాడ్ (Cadaver Dog Squad) గుర్తించిన స్పాట్‌లలో రెస్క్యూ టీమ్స్ ఇంకా తవ్వకాలు చేపడుతూనే ఉన్నాయి.

Next Story