- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దూకుడు
దిశ, తెలంగాణ క్రైంబ్యూరో: టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్దూకుడును మరింతగా పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుకల ఇళ్లల్లో మంగళవారం సిట్బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సోదాల్లో పలు కీలక ఆధారాలను సేకరించారు. అదేవిధంగా రాజశేఖర్‌రెడ్డి సొంతూరు అయిన తాటిపల్లికి కూడా వెళ్లాలని సిట్అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారమే అక్కడికి వెళతారన్న ప్రచారం జరిగింది. అయితే, రేపు లేదా ఎల్లుండి అక్కడికి సిట్అధికారులు వెళ్తున్నారని తెలిసింది. ఇక, సిట్కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి మినహా మిగితా నిందితులను ఒకచోట కూర్చోబెట్టి ప్రశ్నించారు.
పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఎవరెవరికి అమ్మారు? ఎంత డబ్బుకు విక్రయించారు? వచ్చిన డబ్బును ఏం చేశారన్న దానిపై విచారణ జరిపారు. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించాలంటూ కాంగ్రెస్‌పార్టీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను కోర్టుకు సమర్పించాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను పరిశీలించిన తరువాతే కేసును సీబీఐకి అప్పగించాలా? లేదా? అన్న నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొంది. కాగా, మంగళవారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా సిట్నోటీసులు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటికీ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్అధికారులు ఈ కేసులో విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు ప్రశ్నాపత్రాలను అమ్మినట్టు నిర్ధారణ చేసుకున్న అధికారులు మంగళవారం ఈ ఇద్దరి ఇళ్లతోపాటు గురుకుల టీచర్రేణుక నివాసంలో సోదాలు జరిపారు. మణికొండలోని రాజశేఖర్‌రెడ్డి నివాసానికి అతన్ని వెంటబెట్టుకుని వెళ్లిన సిట్అధికారులు విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. దీంట్లో మరికొన్ని ప్రశ్నాపత్రాలు సిట్అధికారుల చేతికి చిక్కినట్టు సమాచారం. దాంతోపాటు కొన్ని పెన్ డ్రైవ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్ట తెలిసింది. ఇక, లంగర్హౌస్ప్రాంతంలో ఉన్న రేణుక ఇంట్లో కూడా సిట్అధికారులు తనిఖీలు చేశారు. ఆ తరువాత ఆమె సొంతూరు గండీడ్‌లో కూడా విచారణ చేపట్టారు. గతంలో రేణుక ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? ఆమె బంధువులు ఎవరెవరు ఉన్నారు? అన్న విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది.
రేవంత్‌రెడ్డి ఆరోపణలతో..
ఇదిలా ఉండగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితునిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి సొంతూరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపర్తి గ్రామ పరిసరాల్లోని ఊర్లలో ఉంటున్న దాదాపు వందమంది గ్రూప్1 పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించినట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్పీఏ తిరుపతి సొంతూరు కూడా రాజశేఖర్‌రెడ్డి ఊరికి దగ్గరే అని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు కలిసే ప్రశ్నాపత్రాలను లీక్చేశారని చెప్పారు. ఈ క్రమంలో సిట్అధికారులు తాటిపర్తికి కూడా వెళ్లి విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంగళవారమే ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, మంగళవారం సిట్అధికారులు అక్కడికి వెళ్లలేదు. బుధవారం ప్రత్యేక అధికారుల బృందం తాటిపర్తికి వెళ్లనున్నట్టు తెలిసింది.
సిట్కార్యాలయంలో..?
టీఎస్పీఎస్సీ నిర్వహించ తలపెట్టిన టౌన్ప్లానింగ్బిల్డింగ్ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్సర్జన్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీతో ఈ మొత్తం తేనెతుట్టె కదిలిన విషయం తెలిసిందే. విచారణలో గ్రూప్1 ప్రిలిమ్స్ తోపాటు మరికొన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టుగా నిర్ధారణ అయ్యింది. కాగా, పదిలక్షల రూపాయలకు ప్రవీణ్ప్రశ్నాపత్రాలను రేణుకకు అమ్మినట్టుగా వెల్లడైన నేపథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి మినహా మిగిలిన నిందితులను మంగళవారం సిట్కార్యాలయంలో ఒకేసారి విచారించారు. ఇప్పటికే ప్రవీణ్నుంచి తీసుకున్న ప్రశ్నాపత్రాలను రేణుక తన భర్త దాక్యానాయక్కు ఇచ్చినట్టు, వాటిని దాక్యానాయక్తన బావమరిది రాజశేఖర్‌నాయక్ కు ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.
రాజశేఖర్తన వద్ద ప్రశ్నాపత్రాలు ఉన్నాయని, కొనేవారు ఉంటే చెప్పమని మేడ్చల్పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్శ్రీనును అడగటం, అతని సూచన మేరకు నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్ లకు 13.50లక్షల రూపాయలకు ప్రశ్నాపత్రాలు అమ్మినట్టు తేలింది. ఈ క్రమంలో ఈ ఇద్దరికే కాకుండా ఇంకా ఎవరెవరికి ప్రశ్నాపత్రాలను అమ్మారు? ఎంత డబ్బు వచ్చింది? ఆ డబ్బును ఏం చేశారు? అన్నదానిపై సిట్అధికారులు రేణుక, దాక్యానాయక్, రాజశేఖర్నాయక్లను ప్రశ్నించినట్టు సమాచారం. కానిస్టేబుల్కేతావత్శ్రీనుకు నీలేష్‌నాయక్, గోపాల్నాయక్ఎలా పరిచయం అన్నదానిపై కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఇంకా ఎవరెవరికి? ఎంత మొత్తానికి ప్రశ్నాపత్రాలు అమ్మారన్న దానిపై లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది.
బండి సంజయ్‌కి సిట్ నోటీసులు..
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేయగా తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా నోటీసులు ఇచ్చింది. రాజశేఖర్‌రెడ్డి సొంతూరు పరిసరాల్లో ఉంటున్న దాదాపు వందమంది గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్షల్లో వందకు పైగా మార్కులు సాధించినట్టు బండి సంజయ్ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సిట్అధికారులు ఆయనకు నోటీసులు ఇస్తూ ఆధారాలను తమకు అందచేయాలని సూచించింది.
అప్పుడే నిర్ణయం–హైకోర్టు
ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి యూత్కాంగ్రెస్అధ్యక్షుడు బల్మూరు వెంకట్దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయని, సిట్విచారణపై తమకు నమ్మకం లేదని పిటీషనర్తరఫున వాదనలు వినిపించిన ఏఐసీసీలీగల్సెల్ ఛైర్మన్వివేక్ధన్కా చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరికే సంబంధం ఉందని మంత్రి కేటీఆర్చెప్పారన్నారు. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్న సమయంలో ఇద్దరికే ప్రమేయం ఉందని ఎలా చెబుతారన్నారు. సీబీఐకి కేసును అప్పగిస్తేనే ఈ వ్యవహారంలో ఎవరెవరు? ఉన్నారన్నది బయటపడుతుందన్నారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ ఈ కేసులో సిట్దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నట్టు చెప్పారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని, ఎవరు దోషులుగా తేలినా వారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను కోర్టుకు సమర్పించాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాతే కేసును సీబీఐకి అప్పగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో ఏజీ వివరాలను కోర్టుకు అందచేయటానికి కొంత సమయం కావాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్11వ తేదీకి వాయిదా వేసింది.