బోర్డులో పనిచేసే 8మంది పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్.. కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-22 03:32:00.0  )
బోర్డులో పనిచేసే 8మంది పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్.. కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు జరిపిన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఒక్క ప్రవీణ్ కాకుండా బోర్డులో పని చేస్తున్న మరో ఎనిమిది మంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు సిట్ గుర్తించింది. వీళ్లందరిని విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. పరీక్ష రాయటానికి బోర్డు నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అన్నదానిపై వీళ్లను ప్రశ్నించనున్నారు. దాంతోపాటు సెలవులపై వెళ్లి పరీక్ష రాసారా? డ్యూటీ చేస్తూనే రాసారా? అన్నది నిర్ధారించుకొనున్నారు. లీకైన ప్రశ్నపత్రం వీరి చేతికి అందిందా? అందితే ఎవరు ఇచ్చారు? అన్నదానిపై కూడా ప్రశ్నించనున్నారు.

Advertisement

Next Story