- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెంట్ మోసాలకు బలి.. దుబాయ్‌లో చిక్కుకున్న సిరిసిల్ల యువకులు
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు యువకులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దుబాయ్‌లోని ఓ కంపెనీ సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ జిల్లాల్లోని ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. తీరా సదరు యువకులు దుబాయ్ వెళ్లాక అసలు విషయం బయటపడింది. ఏజెంట్లు చెప్పిన కంపెనీల వద్దకు యువకులు వెళ్లగా ఉద్యోగాలు లేవంటూ వెళ్లగొట్టారు. ఈ క్రమంలో యువకులకు, దుబాయ్ కంపెనీ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వారు యువకులు తాగి న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి బయటపడి చివరకు దుబాయ్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన యువకులు మోసపోయామని వీడియో బైట్ చేశారు. మంత్రి కేటీఆర్ స్పందించి, తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. పాస్‌పోర్టు, టికెట్లు తీసుకొని ఎయిర్‌పోర్ట్ లోనికి వెళ్లగా, బోర్డింగ్ పాస్ పూర్తయిన తర్వాత ఎయిర్పోర్టు పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన చెందారు. తమ మీద కంపెనీ నిర్వాహకులు కేసులు నమోదు చేశారని, ఈ గండం నుంచి తమను రక్షించాలని మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నారు. కాగా, ఈ వీడియో బాధిత యువకుల కుటుంబ సభ్యుల వద్దకు చేరగా.. వారిలో ఆందోళన మొదలైంది. చివరకు విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లగా.. స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.