జమ్మూలో సిరిసిల్ల ఆర్మీ జవాన్ మృతి.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

by Sathputhe Rajesh |
జమ్మూలో సిరిసిల్ల ఆర్మీ జవాన్ మృతి.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సిరిసిల్ల జవాన్ అనిల్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్ ను కోల్పోవడం బాధకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనిల్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ కు చెందిన పబ్బల మల్లయ్య, లక్ష్మీ దంపతుల కూమారుడు అనిల్ డిగ్రీ పూర్తి కాగానే ఇండియన్ ఆర్మీలో చేరారు. దాదాపు 11 ఏళ్లుగా ఆర్మీలో కొనసాగుతున్నారు. కాగా మృతి చెందిన ఆర్మీ జవాన్ కు ఎనిమిది సంవత్సరాల క్రితం సౌజన్యతో వివాహం కాగా దంపతులకు అయాన్, ఆరవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితమే అనిల్ స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. విధుల్లో భాగంగా హెలికాప్టర్ లో ప్రయానిస్తున్నారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అనిల్ మరణించారు. అనిల్ చనిపోయాడన్న వార్త తెలియడంతో ఆయన స్వగ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story