Earthquake : సింగరేణి కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు : జీఎం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-04 05:12:18.0  )
Earthquake : సింగరేణి కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు : జీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : భూకంపం(Earthquake)కారణంగా సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికుల(Singareni workers)కు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి (GM Enugu Rajeshwar Reddy) స్పష్టం చేశారు. ఉదయం 7:20నిమిషంలో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని, రిక్టర్ స్కేల్ పై 5.3గా భూప్రకంపనలు నమోదయ్యాయని తెలిపారు. భూకంపం ప్రభావంపై హైదరాబాద్ ఎన్జీఆర్ఐ( NGRI )అధికారులతో మాట్లాడం జరిగిందన్నారు.

ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు వారు చెప్పడం జరిగిందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు. వారు భూకంప ప్రభావంపై మరింత అధ్యయనం చేస్తున్నారన్నారు. అయినప్పటికి ముందు జాగ్రత్తగా ఓపైన్ మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను అనుమతిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed