- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణి ఎన్నికలు.. సర్కార్ తీరుపై డౌట్స్
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈసారైన జరిగేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తింపు కార్మిక సంఘం పదవి కాలం పూర్తయి నాలుగేళ్లు గడిచినా అనేక మలుపుల కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నెల 24న ప్రాంతీయ డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్ద కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ఖారారు అయ్యే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు భావిస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల విషయంలో కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తి చూపిస్తుండగా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఆనాసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు ఉంటాయని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
దిశ, కరీంనగర్ బ్యూరో : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈసారైన జరిగేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తింపు కార్మిక సంఘం పదవి కాలం పూర్తయి నాలుగేళ్లు గడిచినా అనేక మలుపుల కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నెల 24న ప్రాంతీయ డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్ద కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ఖారారు అయ్యే అవకాశం ఉందని కార్మిక సంఘాల నాయకులు భావిస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల విషయంలో కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తి చూపిస్తుండగా సింగరేణి యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వం ఆనాసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు ఉంటాయని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ముందడుగుకు అవకాశాలు...
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అనేక మలుపుల మధ్య ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి సంస్థ పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, ఖమ్మం, ఆసిపాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉంది. సింగరేణి సంస్థకు మొత్తం 11డివిజన్లు ఉండగా ప్రస్తుతం 40వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. 2017లో చివరిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తొమ్మిది డివిజన్లలో జయకేతనం ఎగురవేసి గుర్తింపు సంఘంగా ఆవిర్బవించింది.
సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంఘం పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ఎన్నికైన గుర్తింపు సంఘం ప్రతినిధులను కార్మికులకు సంబంధించిన సమస్యలపై, కార్మికుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో సమావేశానికి ఆహ్వానిస్తుంది. 2017 ఎన్నికల సమయంలో కాల పరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత అందించే గెలుపు పత్రంలో మాత్రం రెండేళ్ల కాల పరిమితి అని అందజేశారు. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం గడువు రెండేళ్లు అంటే 2019 సెప్టెంబర్‌లో ముగిసిపోయింది. రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు.
సింగరేణి ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం అసక్తి చూపకపోవడంతో ఎన్నికల ఆలస్యనికి ఒక కారణంగా భావిస్తున్నారు. జాతీయ కార్మిక సంఘాలు సైతం పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పాడి ఎన్నికలు నిర్వహించాలని ఆందోళనలు చేపట్టాయి. పదవీకాలంపై సైతం ఎన్నికల నిర్వహణకు ముందు స్పష్టత ఇవ్వాలని ఆ సంఘాల నాయకులు పట్టుపట్టారు. కేంద్ర కార్మికశాఖ ఉప కమిషనర్ రెండేళ్ల పదవీకాలం ఉంటుందని స్పష్టత ఇచ్చారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు పదవీకాలం ముగిసినప్పటికీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు గుర్తింపు సంఘం నాయకులుగానే చలామణి అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్టీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో 2022 అక్టోబర్ 28న ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. హైకోర్టు తీర్పుతో పాటు గుర్తింపు కార్మిక సంఘాల ఒత్తిడితో ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ముందుకొచ్చింది.
హైకోర్టు ఉత్తర్వులతో వాయిదా..
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ఈ ఏడాది ఏప్రిల్ 2న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రాంతీయ లేబర్ కమిషనర్‌తో పాటు కేంద్ర లేబర్ ఉప కమిషనర్ సిద్దం అయ్యారు. ఈ ఏడాది మార్చి 13న సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్‌లో ప్రాంతీయ లేబర్ కమిషనర్ కార్యాలయం, కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ సమావేశం నిర్వహించి ఏప్రిల్ 2న సింగరేణి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు. కార్మిక శాఖల ప్రకటనతో సింగరేణి సంస్థలో ఎన్నికలు జరుగుతాయని అందరు భావించారు.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల విషయంలో సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఎక్కువ ఉంటుందని, కనుక ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తగ్గుతుందని హైకోర్టుకు వివరించడంతో ఈ ఏడాది మార్చి 23న హైకోర్టు జూన్ 1 తరువాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో ఈ ఏడాది ఏప్రిల్ 2న ఎన్నికల షెడ్యూల్ వాయిదా పండింది.
ఈనెల 24న సమావేశం..
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం పదవి కాలం వివాదం విషయంలో ఈ నెల 13న కార్మిక సంఘాలతో డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం పదవి కాలం నాలుగేళ్లుగా నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటి లేబర్ కమిషనర్ ఈ నెల 24న మరోమారు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల తేదీలు ఖారారయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశంలో ఎన్నికల తేదీలు ఖారారైతే ఈ ఏడాది ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఏడాది రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆగస్టులో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం ముందుకు పోతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నెల 24న జరిగే సమావేశంపై అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More: బట్టబయలు కానున్న ప్రతిష్టాత్మక ‘కాళేశ్వరం’ గుట్టు.. BRS నేతల్లో టెన్షన్.. టెన్షన్..!