చెట్టుకొమ్మను విరగొట్టిన వ్యక్తికి రూ.3 వేల జరిమానా

by Javid Pasha |
చెట్టుకొమ్మను విరగొట్టిన వ్యక్తికి రూ.3 వేల జరిమానా
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : హరిత హరం చెట్టు కొమ్మ విరగొట్టిన వాహన దారుడికి మున్సిపల్ అధికారులు రూ.3వేల జరిమానా విధించారు. మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో మహారాష్ట్రకు చెందిన డీసీఎం డ్రైవర్ విక్రమ్ తన వాహనంతో హరిత హారం చెట్టును ఢీకొట్టాడు. దీంతో చెట్టు కొమ్మ విరిగిపోయింది. విషయం తెలుసుకున్న హరిత హారం అధికారి ఐలయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అనంతరం విషయాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సుకు తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు డీసీఎం డ్రైవర్ కు రూ.3వేలు జరిమానా విధించారు. హరిత హారం చెట్లు, కొమ్మలను నరికినా.. విరగొట్టినా చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story