- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులు నా మీద పడితే భరించాలా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఆడ, మగ అనే తేడా లేకుండా ఒక మహిళ మీద పడి పోలీసులు అరెస్ట్ చేశారని, అలా తనపై పడితే తాను ఎందుకు భరించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల అన్నారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని షర్మిల ప్రశ్నించారు.
సిట్ కార్యాలయానికి తాను ఒక్కదాన్నే వెళ్ళాలనుకున్నానని, సిట్ అధికారిని కలిసి టీఎస్ పీఎస్సీ దర్యాప్తుపై వినతిపత్రం ఇవ్వాలనుకున్నానని ఆమె చెప్పారు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమ అనుమానాలను అధికారికి చెప్పడం తమ భాధ్యత అన్నారు. సిట్ ఆఫీస్ కు వెళ్లేందుకు నేను ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తాను ధర్నాకు, ముట్టడికి పిలుపునివ్వలేదని పేర్కొన్నారు.
అయినా తనను బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు. అలా ఆపడానికి తానేమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా? అని షర్మిల ప్రశ్నించారు. తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? అని షర్మిల ప్రశ్నించారు. తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు తనపై దురుసు ప్రవర్తనకు దిగారని షర్మిల వెల్లడించారు.