'భారం పడుతుందంటే ఎలా సబితమ్మా'.. మంత్రిపై శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఫైర్

by Vinod kumar |
భారం పడుతుందంటే ఎలా సబితమ్మా.. మంత్రిపై శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో శనివారం జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల సమావేశంలో రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను (రూ.3 వేలు) జులై నెల నుంచే అందజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కార్మికులకు గౌరవ వేతనం కింద రూ. వెయ్యి ఇస్తుండగా సీఎం కేసీఆర్‌ దాన్ని రూ.3 వేలకు పెంచుతామన్నారని.. ఆ మేరకు జులై నుంచి కొత్త వేతనాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కారణంగా ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

ఈ నేపథ్యంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ స్పందించారు. వర్కర్స్ గౌరవ వేతనం 1000 నుంచి 3000 లకు పెంచి భారం పడుతుందని అంటే ఎలా సబితమ్మ అంటూ శివాజీ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయాల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి నెలకు ముఖ్యమంత్రి, MLA, MP లకి జీతాల వలన భారం ఎవరి పైన పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి నాలుగు లక్షల జీతం ఉండొచ్చు కానీ భోజనం వండే కార్మికులకు 10 వేల రూపాయలు ఎందుకు ఉండొద్దని ఆయన అన్నారు.

మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇప్పటి వరకూ గౌరవం వేతనం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 33 రూపాయల చొప్పున కార్మికులకు ఇవ్వడం ఎంత దారుణం అంటూ ఆయన ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం దోపిడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు 3 వేల రూపాయలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 10 వేల రూపాయలు గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed