'సనాతన ధర్మంపై మాట్లాడే స్థాయి నీకు ఉందా'.. ఉదయనిధి స్టాలిన్‌పై ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-09-04 13:54:38.0  )
సనాతన ధర్మంపై మాట్లాడే స్థాయి నీకు ఉందా.. ఉదయనిధి స్టాలిన్‌పై ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సనాతన ధర్మంపై మాట్లాడే స్థాయి నీకు ఉందా అంటూ.. తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్‌పై శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఫైర్ అయ్యారు. వెంటనే యావత్ హిందు సమాజానికి బహిరంగంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ద్రావిడ ముసుగులో ఉన్న క్రైస్తవుడు ఉదయనిధి స్టాలిన్ అని.. తమిళనాడు ప్రజల ఆగ్రహం స్టాలిన్ కుటుంబానికి త్వరలో తెలుస్తుంది. స్టాలిన్ పార్టీని తమిళ ప్రజలు భూస్థాపితం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్టు ఇంకో సారి సనాతన ధర్మంపై తప్పుగా మాట్లాడిన చెప్పులతో కొడతాం.. అని ఫైరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే ఉదయనిధిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్.

సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి పూర్తి వ్యతిరేకమని తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌, డెంగ్యూ, మలేరియాతో సనాతన ధర్మాన్ని పోల్చారు. దీనిని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని.. పూర్తిగా రూపుమాపాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని అసోసియేషన్‌ నిర్ణయించటాన్ని ఆయన సమర్థించారు.

Advertisement

Next Story