భారత్‌గా మాత్రమే పిలవాలి.. ఇందుల్లో రాజకీయం ఎక్కడ ఉంది : సింకారు శివాజీ

by Vinod kumar |   ( Updated:2023-09-07 13:51:19.0  )
భారత్‌గా మాత్రమే పిలవాలి.. ఇందుల్లో రాజకీయం ఎక్కడ ఉంది : సింకారు శివాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా పేరు భారత్‌గా మారుస్తున్నారంటూ ఇప్పుడు దేశం పేరుపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇండియా పేరును ఇంగ్లీష్‌‌లో కూడా భారత్‌గా మార్చాలని కేంద్రం భావిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. జీ 20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో రాష్ట్రపతి ఇచ్చే విందుకు పంపిన ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిండెంట్‌ ఆఫ్‌ ఇండియా' కు బదులుగా 'ప్రెసిండెంట్‌ ఆఫ్‌ భారత్‌' గా ఉండడంతో ఈ చర్చకు దారితీసింది. దీనిపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ స్పందించారు. బ్రిటిష్ వారు పెట్టిన పేరు ఇండియా.. ఇంకా ఈ దేశానికి ఎందుకు ఉండాలని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ అన్నారు.

ఈ దేశంలో అత్యున్నతమైన అవార్డు పేరు భారత రత్న అలాంటప్పుడు ఈ దేశం కేవలం భారత్‌గా ఉంటే తప్పేముందన్నారు. ఆర్టికల్ 1 ద్వారా దేశాన్ని ఇండియా, భారత్ రెండు పేర్లతో పిలిచే హక్కు ఉంది. ఆర్టికల్ 1 సవరణ ద్వారా భారత్‌గా మాత్రమే పిలవాలని డిమాండ్ చేశారు. కొంత మంది ఇండియా కూటమి సభ్యులకు పిచ్చి పట్టిందని ఫైర్ అయ్యారు. 'భారత్ మాతాకీ జై' అనటం వలన కొన్ని పార్టీలకు ఎందుకు నచ్చడం లేదు.. దేశాన్ని తల్లిగా భావించి భారత్ మాతాకీ జై అంటాం దీంట్లో రాజకీయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పేర్లు మార్చాల్సిన అవసరం కూడా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భయంకరమైన హిందు అయితే హైదరాబాద్‌ పేరును భాగ్య నగర్‌‌గా వెంటనే మార్చాలి.. సికింద్రాబాద్‌ను ఉజ్జయినీ మహంకాలీగా, నిజామాబాద్‌ను ఇందూర్‌‌గా, మహబూబ్ నగర్‌ను పాలమూరుగా, కరీంనగర్‌ను కరినగర్‌గా మార్చాలీ.. నిజాం నవాబులు పెట్టిన పేర్లను గుర్తించి నిజమైన పేర్లను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సనాతన ధర్మం పైన ఉదయనిదీ స్టాలిన్ చేసిన కామెంట్స్‌పై సింకారు శివాజీ స్పందించారు. సనాతన ధర్మం పైన పిచ్చిగా మాట్లాడితే బహిరంగంగా దాడులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. సనాతన ధర్మం నిర్మూలించడం ఎవరి తరం కాలేదనే చరిత్ర తెలియని అజ్ఙానులు ఇంకా ఈ దేశంలో ఉండటం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తం చేశారు. శివసేన పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తే కచ్చితంగా మెజారిటీ ప్రజల కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. భారత్ దేశంలోని మెజారిటీ ప్రజల కొరికలను తీర్చే విధంగా పాలన ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో పార్లమెంట్ కన్వినర్ సుర్యవంశి రమేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed