- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌పై పోటీకి తెలంగాణ శివసేన సిద్ధం.. అభ్యర్థి అతనే!
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే స్థానం నుంచి తమ పార్టీ నుంచి పోటిగా ఒక రైతుని నిలబెడతామని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ వెల్లడించారు. సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పోటీచేసే స్థానం పైన తమ పార్టీ నుంచి ఒక పద్మశాలి వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చి నిలబెడతామని శివాజీ హామీ ఇచ్చారు. హరీష్ రావు పైన తమ పార్టీ అభ్యర్థి అమరవీరుల కుటుంబం నుంచి టికెట్ ఇస్తామన్నారు. కవిత పైన పసుపు రైతుకు తమ పార్టీ నుంచి టికెట్ ఇస్తామన్నారు. విద్యార్థి నాయకులుగా చలామణి అయి చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిషోర్, శంభీపూర్ రాజు, బాబా ఫసియుద్దీన్ లాంటి వారిపై తమ పార్టీ నుంచి విద్యార్థి నాయకులకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో శివసేన పార్టీ బలోపేతం
తెలంగాణలో శివసేన పార్టీని బలోపేతం చేయబోతున్నామని శివాజీ వెల్లడంచారు. ప్రతి జిల్లాలో పూర్తి స్థాయిలో కమిటీలు వేయబోతున్నామని తెలిపారు. శివసేన పార్టీ అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రజా ఎజెండాను సిద్ధం చేశామని చెప్పారు. గల్లీ నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమస్య పైన పొలిటికల్ ఫైట్ చేయబోతున్నామని తెలిపారు. రైతుల సమస్యల పైన, నిరుద్యోగ, విద్యార్థుల, మహిళ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులైన అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగడం కోసం పోరాటం ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో శివసేన పార్టీ పోటీ చేయబోతున్నామని అన్నారు. 33 శాతం మహిళలకు సీట్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు, విద్యార్థి నాయకులకు తమ పార్టీ నుంచి టికెట్లు ఇస్తామన్నారు. 50 శాతం బీసీలకు టికెట్లు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన తమ పార్టీ టికెట్లు ఇస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సైతం తమ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, దళిత, బహుజన వర్గాలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతీ ఒక్కరు శివ సేన పార్టీలో చెరి ప్రజా ఉద్యమం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Also Read..
రేవంత్ రెడ్డి ప్లెక్సీకి పేడ కొట్టిన గొల్ల కురుమలు.. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్..