- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి కొత్త సెక్రెటేరియట్‌కు షిఫ్టింగ్.. 30న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్ ఈనెల 30న ప్రారంభం కానుంది. దానిని పురస్కరించుకొని ప్రస్తుతం బీఆర్‌కేఆర్ భవన్‌లో ఉన్న అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను, ముఖ్యమైన పరికరాలను సోమవారం నుంచి కొత్త సెక్రటేరియట్‌కు తరలించనున్నారు. శనివారం రంజాన్ కావడం, ఆదివారం సెలవుదినం కావడంతో ఈ రెండ్రోజులు షిఫ్టింగ్‌కు సాధ్యపడలేదు. అయితే సోమవారం నుంచి అన్ని విభాగాలకు చెందిన ఫైళ్లను నూతన సెక్రటేరియట్‌కు తరలించనున్నారు. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన ఫైళ్లను తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.
డిపార్ట్మెంట్‌లో ఉద్యోగులు, సిబ్బందిని బట్టి ఆయా ఫ్లోర్లను కేటాయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఫోటో కాల్, సెక్రటేరియట్ ఉద్యోగుల వ్యవహారాలను జెఏడీ పర్యవేక్షిస్తుంది. దీంతో ఆయా శాఖలను ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఎక్కువ ఉద్యోగులు ఉన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌ను సెకండ్ ఫ్లోర్లో, రెవెన్యూ శాఖను థర్డ్ ఫ్లోర్లో, పంచాయతీరాజ్ శాఖ ఫోర్త్ ఫ్లోర్లో, ఇరిగేషన్ శాఖ ఫిఫ్త్ ఫ్లోర్లో, మిగతా శాఖలను వివిధ ఫ్లోర్లలో ఏర్పాటు చేయనున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
ప్రతి శాఖకు సంబంధించిన ఫైళ్ళతో పాటు, కొత్త కంప్యూటర్లను ఏర్పాటు చేసి వాటితో ఎప్పటికప్పుడు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీఆర్‌కే భవన్‌లో ఉన్న కంప్యూటర్ల నుంచి సంబంధిత శాఖల వివరాలను పెన్ డ్రైవ్‌లో తెచ్చుకోవాలని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఫిజికల్ ఫైల్స్ మాత్రం సోమవారం నుంచి నూతన సెక్రటేరియట్ భవన్‌కు అధికారులు తరలించనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 30వ తేదీన అధికారికంగా ఘనంగా సీఎం కేసీఆర్ నూతన సెక్రటేరియట్‌ను ప్రారంభించి అక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహించనున్నారు.