- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRK భవన్ నుంచి కొత్త సచివాలయంలోకి షిఫ్టింగ్ ఆరోజే!
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చేవారం నుంచి కొత్త సెక్రటేరియట్‌లోకి డిపార్ట్‌మెంట్స్ షిఫ్టింగ్ పనులు షురూ కానున్నాయి. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఏ ఫ్లోర్ లో, ఏ డిపార్ట్‌మెంట్ ఉండాలో కసరత్తు జరుగుతున్నది. నాలుగైదు రోజుల్లో షిఫ్టింగ్ పనులు పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిసింది. ఈనెల 30న కొత్త సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ లోపు ప్రస్తుతం బీఆర్కే బిల్డింగ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న డిపార్ట్ మెంట్లను కొత్త సెక్రటేరియట్ లోకి షిఫ్టింగ్ చేయాలని సీఎం భావిస్తున్నారు.
కేసీఆర్ పర్యవేక్షణలోనే కేటాయింపులు
కొత్త సెక్రటేరియట్‌లో ఏశాఖ ఏ ఫ్లోర్‌లో ఉండాలి? ఏ మంత్రి ఏ చాంబర్‌లో కూర్చోవాలి? ఏ అధికారికి ఎంత మేరకు స్పేస్ ఉన్న చాంబర్ ఇవ్వాలి? అనే అంశాలను నేరుగా సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. రెండు రోజులుగా ఇదే పనిలో ఆయన నిమగ్నమయ్యారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 24 నుంచి శాఖల తరలింపు ఉంటుందని సమాచారం. ఈ మేరకు రెండు, మూడు రోజల్లో ఆర్డర్స్‌ను వెలువడనున్నట్టు టాక్. ఇష్టానుసారంగా శాఖల కేటాయింపు ఉండకుండా అంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. అయితే డిపార్ట్‌మెంట్ ఉండే ఫ్లోర్ లోనే ఆ శాఖకు చెందిన మంత్రి చాంబర్, ఆయన పేషీను ఏర్పాటు చేస్తున్నారు.
ఫస్ట్ జీఏడీ, సెకండ్ ఫైనాన్స్, థర్డ్ రెవెన్యూ!
డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సిబ్బంది, ఆ శాఖలో ఉండే సెక్షన్ల సంఖ్య మేరకు కొత్త సెక్రటేరియట్‌లో స్పేస్‌ను కేటాయిస్తున్నారు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వ్యవహారాలు, ప్రభుత్వ ప్రొటోకాల్ అంశాలను జీఏడీ పర్యవేక్షిస్తున్నది. దీంతో ఆశాఖను ఫస్ట్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఎక్కువ సెక్షన్లు ఉన్న ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ను సెకండ్ ఫ్లోర్‌లో, రెవెన్యూ శాఖను థర్డ్ ఫ్లోర్‌లో, పంచాయతీ రాజ్‌కు 4వ అంతస్తు, ఇరిగేషన్‌కు 5వ అంతస్తు కేటాయించినట్టు టాక్. మిగతా శాఖలకు బిల్డింగ్‌లోని ప్రతి ఫ్లోర్ లో ఉండే రైట్ లేదా లెఫ్ట్ స్పేస్‌లో అలాట్మెంట్ చేస్తున్నట్టు తెలిసింది.
అన్నీ కొత్త కంపూటర్లే
కొత్త సెక్రటేరియట్‌లో ఒకే తీరుగా ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం బీఆర్కే బిల్డింగ్‌లో ఉన్న ఫర్నీచర్‌ను అక్కడే వదిలేయాలని సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం వాడుతున్న కంపూటర్లను కూడా అక్కడే వదిలేసి, పెన్ డ్రైవ్ లో డేటా, ఫిజికల్ ఫైల్స్‌ను మాత్రమే వెంట తెచ్చుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. వచ్చేవారం షిఫ్టింగ్ పనులు షురూ కానున్న నేపథ్యంలో సెక్రటేరియట్ స్టాఫ్ తమ శాఖల ఫైల్స్‌ను సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారు.