- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి బ్రేక్.. షర్మిల రాకను అడ్డుకుంటున్న హస్తం కీలక నేత..?
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్నదంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నదన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది.
షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే.. తెలంగాణలో నష్టపోతామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోనే విలీనానికి ప్రస్తుతం బ్రేక్ పడ్డట్టు సమాచారం. ఏపీ కాంగ్రెస్‌లో చేరేందుకు షర్మిల ముందు ప్రపోజల్స్ ఉంచినట్టు టాక్. ఆమె మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో షర్మిల రాజకీయ భవిష్యత్‌పై గందరగోళం నెలకొన్నది.
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కానీ..
షర్మిల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ రాష్ట్రంలోని కొంత మంది ముఖ్య నేతలు మాత్రం ఆమె రాకను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల వేళ షర్మిల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. ఇటీవల కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల వరసగా భేటీ అయ్యారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసందుకు ఆమె మొగ్గు చూపినట్టు ఉహాగానాలు వినిపించాయి.
టీ కాంగ్రెస్‌లో ఆందోళన
షర్మిలను చేర్చుకుంటే రాజకీయంగా నష్టం తప్పదని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వాళ్లు ఆలోచనలో పడ్డట్టు టాక్. వైఎస్ వారసురాలిగా పార్టీలోకి వస్తానంటే వద్దనడం సరికాదని.. ఏదో ఓ సీటు ఇస్తే సరిపోతుంది కదా అనే అభిప్రాయంతో అధిష్టానం ఉందని సమాచారం.
కానీ ఇక్కడి నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. 2018లో చంద్రబాబుతో స్నేహం కొపం ముంచిందని ఈసారి కూడా అలాంటి పొరపాటు రిపీట్ కావొద్దని వాదిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహకర్త, ఆ పార్టీ కీలకనేత అధిష్టానం వద్ద క్లియర్‌గా చెప్పినట్టు టాక్. షర్మిల మాత్రం ఏపీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రణాళిక ఏమిటన్నది సందిగ్ధంగా మారింది.