తెలంగాణ, ఏపీ మళ్లీ కలవడం అసాధ్యం: సజ్జలకు షర్మిల కౌంటర్

by Satheesh |   ( Updated:2022-12-08 14:55:02.0  )
తెలంగాణ, ఏపీ మళ్లీ కలవడం అసాధ్యం: సజ్జలకు షర్మిల కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: అవకాశం ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సజ్జల వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విడిపోయిన రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అసాధ్యమని.. ఎంతో మంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని పేర్కొన్నారు. సజ్జల వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మాని.. వారి ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఎందరో అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడవద్దని సూచించారు.

READ MORE

YCP సారథులొచ్చేశారోచ్.. తెరపైకి గృహసారథులు!

Advertisement

Next Story