- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్లే కదా? కేటీఆర్‌పై షర్మిల విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీకి సంబంధించి కేటీఆర్‌పై ట్విట్టర్‌లో మండిపడ్డారు. పేపర్ లీకేజీ సమయంలో టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తోందని కేటీఆర్ అన్నారని, ఇప్పుడేమో ప్రక్షాళన చేస్తామని చెబుతున్నారంటే చిన్న దొర తప్పు ఒప్పుకున్నట్లే కదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని బొంకుతున్నారని విమర్శించారు.
ఇన్నేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుని ఎన్నికల వేళ ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని కేటీఆర్‌పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడి ఇప్పుడు నిరుద్యోగులపై ప్రేమ కురిపిస్తున్నారని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని, మీరు నిరుద్యోగ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయమని ఆరోపించారు. నిరుద్యోగుల బలిదానాలపై అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను నిండా ముంచారని షర్మిల విమర్శించారు.