టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: ఈడీ విచారణకు రాని శంకర్​లక్ష్మి

by Javid Pasha |
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: ఈడీ విచారణకు రాని శంకర్​లక్ష్మి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసు ఇచ్చినా టీఎస్పీఎస్సీ బోర్డు ఉద్యోగిని శంకర్​లక్ష్మి రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు విచారణకు రాలేకపోతున్నట్టు ఆమె ఫోన్​ద్వారా ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కాగా, ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిలను ప్రశ్నించటానికి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటీషన్​పై విచారణ గురువారానికి వాయిదా పడింది. రాష్ర్టవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మనీలాండరింగ్ ​జరిగినట్టుగా భావించిన ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోర్డులోని కాన్ఫిడెన్షియల్ ​సెక్షన్​ ఇంఛార్జీగా ఉన్న శంకర్​లక్ష్మితో పాటు మరో ఉద్యోగి సత్యనారాయణను గురు, శుక్రవారాల్లో విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఈ క్రమంలో శంకర్​లక్ష్మి బుధవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే ఆమె రాలేదు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని శంకర్​లక్ష్మి ఫోన్​ద్వారా ఈడీకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇక కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖ్​ర్​రెడ్డిలను విచారిస్తే కీలక వివరాలు వెలుగు చూస్తాయని భావించిన ఈడీ అధికారులు వారిని విచారించటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటీషన్​దాఖలు చేశారు. జైల్లోనే వారిని విచారిస్తామని పేర్కొంటూ వీడియో కెమరాలు ఇతర ఎలక్ర్టానిక్​పరికరాలను లోపలికి తీసుకెళ్లేలా జైలు సూపరిండింటెంట్​కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటీషన్​పై విచారణ గురువారానికి వాయిదా పడింది.

Advertisement

Next Story