సిగ్గుపడు కేసీఆర్ అంటూ.. సీఎంపై షర్మిల షాకింగ్ కామెంట్స్

by Sathputhe Rajesh |
సిగ్గుపడు కేసీఆర్ అంటూ.. సీఎంపై షర్మిల షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు పట్టడం లేదని షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన తొమ్మిదేళ్ల పరిపాలనలో తొమ్మిది వేల మంది రైతులను కేసీఆర్ సర్కార్ బలి తీసుకుందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలెత్తినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షానికి వడ్లు తడిసి ఓ కౌలు రైతు తాను చనిపోతున్నానని ముందే చెప్పినా ఈ ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని మండిపడ్డారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల.. ఇది రైతులను ఆదుకోని అసమర్థ ప్రభుత్వమన్నారు.

ఓట్ల కోసమే కేసీఆర్ రైతు నినాదం ఎత్తుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సిగ్గుపడాలని మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఐకేపీ సెంటర్లు తెరవాలని, రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపి తడిసిన వడ్లు సైతం కొనుగోలు చేయాలన్నారు. 2023లో ఇప్పటికే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా ఈ దిక్కుమాలిన పాలనలో పంట బీమా కూడా లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed